భూ సర్వేను పక్కాగా నిర్వహించాలి: ఆర్డీవో

ABN , First Publish Date - 2022-11-24T00:46:32+05:30 IST

జగనన్న భూ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని పత్తికొండ ఆర్డీవో మోహన్‌ దాస్‌ సూచించారు.

భూ సర్వేను పక్కాగా నిర్వహించాలి: ఆర్డీవో

ఆలూరు, నవంబరు 23: జగనన్న భూ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని పత్తికొండ ఆర్డీవో మోహన్‌ దాస్‌ సూచించారు. బుధవా రం ఆలూరు మండల పరి షత్‌ సమావేశ భవనంలో జగనన్న భూ సర్వే-భూ హక్కు పథకంపై ఆలూరు, ఆస్పరి, హాలహర్వి, చిప్పగిరి మండలాల్లోని అన్ని గ్రామ సచివాలయాలు, గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ సర్వేయర్‌లు, పంచాయితీ కార్యదర్శులు (గ్రేడ్‌ 1-5) ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి గ్రామ పంచాయతీలలో చేర్చాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ కలెక్టర్‌ రమాకాంత్‌ రెడ్డి, డివిజనల్‌ పంచాయతీ అధి కారి శ్రీకాంత్‌ చౌదరి, డివిజనల్‌ సర్వేయర్‌ భాస్కర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T00:46:32+05:30 IST

Read more