భూ దందాలు నిరూపిస్తాం: సుబ్బారెడ్డి

ABN , First Publish Date - 2022-08-17T05:57:41+05:30 IST

పట్టణంలో, హైవే పరిసరాల్లో మంత్రి అనుచరులు చేస్తున్న భూదందాలను నిరూపిస్తామని టీడీపీ డోన్‌ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు.

భూ దందాలు నిరూపిస్తాం: సుబ్బారెడ్డి
కరపత్రాలు అందజేస్తున్న ధర్మవరం సుబ్బారెడ్డి

డోన్‌, ఆగస్టు 16: పట్టణంలో, హైవే పరిసరాల్లో మంత్రి అనుచరులు చేస్తున్న భూదందాలను నిరూపిస్తామని టీడీపీ డోన్‌ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం పట్టణంలోని 21వ వార్డులో టీడీపీ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ ఇన్‌చార్జి సుబ్బారెడ్డి మాట్లాడుతూ మంత్రి బుగ్గన అనుచరులు, రైతులు, వ్యాపారులను బెదిరిస్తూ భూములను, విలువైన స్థలాలను లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంటు స్థలం కూడా కబ్జా కానివ్వమని మంత్రి బుగ్గన చెబుతున్నారని, అయితే ఎకరాలకు ఎకరాలు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. రైతులు, వ్యాపారులు భూములు అమ్ముకోవాలన్నా వాటాలు ఇవ్వాలని మంత్రి అనుచరులు బ్లాక్‌మెయిల్‌ చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వైసీపీ నాయకుల భూదందాలను ఆధారాలతో సహా నిరూపిస్తామని, బహిరంగచర్చకు రావాలని సవాల్‌ విసిశారు. మంత్రి బుగ్గనకు చిత్తశుద్ధి ఉంటే తమ సవాల్‌ మీద బహిరంగ చర్చకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, పట్టణ పార్టీ అద్యక్షుడు సీఎం శ్రీనివాసులు, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ప్రజావైద్యశాల మల్లికార్జున, జిల్లా కార్యదర్శి అభిరెడ్డిపల్లె గోవిందు, భాష్యం శ్రీధర్‌, భాష్యం శ్రీనివాసులు గౌడు, ఎస్‌టీ గుల్షన్‌, మధుసూదన్‌ రెడ్డి, కొచ్చెర్వు రామాంజినేయులు, ఉడుములపాడు నాగేంద్ర పాల్గొన్నారు.


Read more