‘కోట్ల సేవలు మరువలేనివి’

ABN , First Publish Date - 2022-08-17T05:54:32+05:30 IST

పెద్దాయన కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి చేసిన సేవలు మరువలేనివని టీడీపీ డోన్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు.

‘కోట్ల సేవలు మరువలేనివి’
నివాళి అర్పిస్తున్న టీడీపీ నాయకులు

డోన్‌, ఆగస్టు 16: పెద్దాయన కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి చేసిన సేవలు మరువలేనివని టీడీపీ డోన్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం దివంగత కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని కోట్ల విగ్రహం వద్ద టీడీపీ ఆధ్వర్యంలో కోట్ల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ ఇన్‌చార్జి సుబ్బారెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, మాజీ ఎంపీపీ ఆర్‌ఈ రాఘవేంద్ర, పట్టణ పార్టీ అధ్యక్షుడు సీఎం శ్రీనివాసులు, బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి భాస్కర్‌ నాయుడు, బీసీ సెల్‌ టీడీపీ జిల్లా అద్యక్షుడు ప్రజావైద్యశాల మల్లికార్జున, మండల టీడీపీ అద్యక్షుడు శ్రీనివాసులు యాదవ్‌, ఓబులాపురం శేషిరెడ్డి, జిల్లా టీడీపీ కార్యదర్శి అభిరెడ్డిపల్లె గోవిందు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోవిందరెడ్డి పాల్‌ రాజు, మధుసూదన్‌ రెడ్డి, బాబులాల్‌, ఉడుములపాడు నాగేంద్ర, కొచ్చెర్వు రామాంజినేయులు, ఎల్‌ఐసీ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. 


డోన్‌ (రూరల్‌): పట్టణంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని కొత్తబస్టాండు రోడ్డులో ఉన్న కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి విగ్రహానికి ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సీలం భాస్కర్‌ నాయుడు ఆధ్వర్యంలో ఘన నివాలులర్పించారు. ఏపీ బీసీ సంక్షేమ సంఘం నాయకులు గోసానిపల్లె చిన్నయ్య, రాజేష్‌ నాయుడు, ఖాజా, తదితరులు పాల్గొన్నారు.


 కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ లోక్‌సభ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గార్లపాటి మద్దిలేటి, నియోజకవర్గ కార్యదర్శి జనార్దన్‌ యాదవ్‌, న్యాయవాది శివారమకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. 

Read more