శ్రీశైలంలో కామదహనం

ABN , First Publish Date - 2022-03-17T05:06:13+05:30 IST

శ్రీశైల క్షేత్రంలో బుధవారం ఫాల్గుణ శుద్ధ చతుర్థశిని పురస్కరించుకుని సాయంకాలం 6.00 గంటలకు కామదహన కార్యక్రమాన్ని దేవస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించింది.

శ్రీశైలంలో కామదహనం
కామదహన కార్యక్రమంలో అర్చకులు, ఈవో లవన్న

శ్రీశైలం, మార్చి 16: శ్రీశైల క్షేత్రంలో బుధవారం ఫాల్గుణ శుద్ధ చతుర్థశిని పురస్కరించుకుని సాయంకాలం 6.00 గంటలకు కామదహన కార్యక్రమాన్ని దేవస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించింది.  ఆలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపి  అనంతరం ఆలయ ప్రాంగణంలో   పల్లకి సేవ నిర్వహించారు. ఆ తర్వాత గడ్డితో చేసిన మన్మథ రూపాన్ని దహనం చేశారు. చివరగా భక్తులకు పప్రసాద వితరణ చేశారు. 


Read more