టీడీపీలో చేరిక

ABN , First Publish Date - 2022-12-30T00:42:12+05:30 IST

నగరంలోని 6వ వార్డులో సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా భారీగా టీడీపీలో చేరారు.

టీడీపీలో చేరిక

కర్నూలు(అగ్రికల్చర్‌), డిసెంబరు 29: నగరంలోని 6వ వార్డులో సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా భారీగా టీడీపీలో చేరారు. గురువారం టీజీ భరత్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి, కర్నూలు పార్ల మెంటు అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీ భరత్‌ వార్డు లోని అన్ని వీధుల్లో తిరిగి ప్రజలను కలిశారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీలోకి చేరారు. టీజీ భరత్‌ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం టీజీ భరత్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చర్యలతో రాష్ట్ర ప్రజలకు ఇప్పటికీ రాజధాని లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి మాట్లాడుతూ కర్నూలు లో కోట్ల, టీజీ కుటుంబాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాయని అన్నారు. సోమి శెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కర్నూలులో టీజీ భరత్‌ ఎమ్మెల్యే అయితే.. యువత భవిష్యత్తు బావుంటుందన్నారు.

Updated Date - 2022-12-30T00:42:12+05:30 IST

Read more