‘జగన్‌ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు’

ABN , First Publish Date - 2022-11-25T00:57:16+05:30 IST

ఎస్టీలకు అన్యాయం చేయాలని చూస్తే జగన్‌ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని ఏపీ గిరిజన సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నాయకులు వెంకటరమణనాయక్‌, వెంకటపతి, సోమ్లానాయక్‌, చంద్రప్ప, మోటా రాముడు హెచ్చరించారు.

 ‘జగన్‌ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు’

పత్తికొండటౌన్‌, నవంబరు 24: ఎస్టీలకు అన్యాయం చేయాలని చూస్తే జగన్‌ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని ఏపీ గిరిజన సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నాయకులు వెంకటరమణనాయక్‌, వెంకటపతి, సోమ్లానాయక్‌, చంద్రప్ప, మోటా రాముడు హెచ్చరించారు. గురువారం స్థానిక గోపాల్‌ప్లాజాలో గిరిజన సం ఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం సోమ్లా నాయక్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాల్మీకి, బోయ, బెంతు, ఓరియా కులాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవో నెం.52ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్‌నాయక్‌, మాజీ జడ్పీటీసీ నారాయణనాయక్‌, చక్రీనాయక్‌, పరుశరాముడు, రవీంద్రనాయక్‌, శంకర్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-25T00:57:16+05:30 IST

Read more