జగన్‌ పోవాలి.. చంద్రబాబు సీఎం కావాలి

ABN , First Publish Date - 2022-07-18T06:59:15+05:30 IST

ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌ పోవాలి.. విజన్‌ ఉన్న నారా చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని టీడీపీ నంద్యాల పార్లమెంటు ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి అన్నారు.

జగన్‌ పోవాలి.. చంద్రబాబు సీఎం కావాలి

2019లో చేసిన పొరపాటు మళ్లీ చేయవద్దు
నంద్యాల పార్లమెంటు ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి


కల్లూరు, జూలై 17: ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌ పోవాలి.. విజన్‌ ఉన్న నారా చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని టీడీపీ నంద్యాల పార్లమెంటు ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి అన్నారు. ఆదివారం కల్లూరు అర్బన్‌లోని 19, 20, 21 వార్డులలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి బూత్‌ కమిటీల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాణ్యం టీడీపీ ఇన్‌చార్జి గౌరు చరిత హాజరయ్యారు. ఈసందర్భంగా మాండ్ర శివానందరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదును చేయించాలని పిలుపునిచ్చారు. టీడీపీ సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరికీ రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని తెలిపారు. ముఖ్యంగా ఒక్క చాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాల్చేశారని, లిక్కర్‌, శాండ్‌, మైనింగ్‌లపై రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. 2019లో చేసిన పొరపాటును 2024లో చేయవద్దని, నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. అనంతరం గౌరు దంపతులు మాట్లాడుతూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు బూత్‌ కమిటీల స్థాయి నుంచి కీలకంగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సైనికుల్లా కష్టపడి పని చేసి రాష్ట్ర భవిష్యత్‌ కోసం చంద్రబాబును సీఎంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌ యాదవ్‌, కర్నూలు, నందికొట్కూరు మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్లు పెరుగు పురుషోత్తంరెడ్డి, గుండం రమణారెడ్డి, బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి కాసాని మహే్‌షగౌడు, పాణ్యం తెలుగు యువత, మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు గంగాధర్‌గౌడు, ఎస్‌.ఫిరోజ్‌, పెద్దపాడు చంద్రకళాధర్‌ రెడ్డి, టీడీపీ జిల్లా కార్యదర్శి కేతూరు మధు పాల్గొన్నారు.


Read more