ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చడం తగదు

ABN , First Publish Date - 2022-09-22T06:24:22+05:30 IST

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు తొలగించి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పేరు పెట్టడం తగదని మంత్రాలయం నియో జకవర్గ టీడీపీ ఇన్‌చార్జి తిక్కారెడ్డి అన్నారు.

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చడం తగదు
పత్తికొండలో ఎన్టీఆర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తున్న కేఈ శ్యాంబాబు

టీడీపీ మంత్రాలయం ఇన్‌చార్జి తిక్కారెడ్డి

మంత్రాలయం, సెప్టెంబరు 21: ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు తొలగించి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పేరు పెట్టడం తగదని మంత్రాలయం నియో జకవర్గ టీడీపీ ఇన్‌చార్జి తిక్కారెడ్డి అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్‌టీ రామారావు పేరును హెల్త్‌ యూనివర్సిటీ నుంచి  తొల గించడం వైసీపీకి సిగ్గు చేటన్నారు. వెంటనే హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును యథావిధిగా కొనసాగించాలని అన్నారు.

ఆదోని: ఎన్టీఆర్‌ యూనివర్సిటీకి వైఎస్‌ఆర్‌ పేరు పట్టడంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బుధవారం స్వగృహంలో ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ 1986 ఏర్పాటైన ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీతో  వైఎస్సార్‌కు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌  పేరు తీసేసి  వైఎస్సార్‌ పేరు ఎట్లా పెడతారని  ప్రశ్నించారు. 

ఎమ్మిగనూరు: ఎన్టీఆర్‌ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లును ఉపసంహరించుకోవాలి మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి అన్నారు. బుధ వారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ 1986లో ఏర్పాటైన ఎన్టీఆర్‌ హెల్త్‌ యునివర్సిటీకి వైఎస్సార్‌ పేరు ఎలా పెడతారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభు త్వం ఏర్పడి నాలుగేళ్లు కావస్తున్నా కొత్తగా ఒక్క నిర్మాణం చేపట్టకపోగా ఇలా ఉన్న వాటిపేర్లు మార్చుతూ పబ్బం గడుపుకుంటోందని విమర్శించారు.

పత్తికొండ: ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మారిస్తే చూస్తూ ఊరుకో మని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కేఈ శ్యాంబాబు అన్నారు. హెల్త్‌ యూని వర్సిటీ పేరు మార్పును నిరసిస్తూ పత్తికొండలో టీడీపీ ఆధ్వర్యంలో బుధవా రం నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం నాలుగు స్తంభాల  కూడలి వద్ద కేఈ శ్యాంబాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా శ్యాంబాబు మాట్లాడుతూ హెల్త్‌ యూనివర్సిటీ నిర్మాణం కోసం కృషి చేసి స్థాపించిన ఎన్టీఆర్‌ పేరును మార్చడం వైసీపీ ప్రభుత్వానికి తగదన్నారు.  టీడీపీ నాయకులు సాంబశివారెడ్డి, అశోక్‌, బత్తిన లోక్‌నాథ్‌, సింగం శీను,  గుడిసె నరసింహులు, దాదావలి, మీరాహుసేన్‌, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-22T06:24:22+05:30 IST