-
-
Home » Andhra Pradesh » Kurnool » It is a begging situation under YCP rule-NGTS-AndhraPradesh
-
వైసీపీ పాలనలో అడుక్కుతినే పరిస్థితి
ABN , First Publish Date - 2022-09-08T06:08:41+05:30 IST
వైసీపీ పాలనలో అడుక్కు తినే పరిస్థితి వచ్చిందని ఎండీ హళ్లి సర్పంచ్ సుధాకర్ అన్నారు.

నేలపై కూర్చొని టీడీపీ సర్పంచుల నిరసన
రసాభాసగా సర్వసభ్య సమావేశం
హొళగుంద,
సెప్టెంబరు 7: వైసీపీ పాలనలో అడుక్కు తినే పరిస్థితి వచ్చిందని ఎండీ హళ్లి
సర్పంచ్ సుధాకర్ అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాల యంలో బుధవారం
సర్వసభ్య సమావేశం జరిగింది. ఎంపీపీ నూర్జహాన్ అధ్యక్షతన ప్రారంభ మైన
సమావేశంలో అధికారు లతో టీడీపీ, కాంగ్రెస్ సర్పంచు లు వాగ్వాదం
చోటుచేసుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ పంచాయతీ నిధులు వైసీపీ
ప్రభుత్వం తమ ఖజా నాకు మళ్లించుకోవడంతో గ్రామ అభివృద్ధి ఆగిపోయిందన్నారు.
సర్పంచులు ప్రజలకు మొహం చూపించలేక ఇళ్లలో ఉండాల్సిన పరిస్థితి నెలకొందని
అన్నారు. హెబ్బటం నుండి ఇంగళదహాల్ వరకు రోడ్డుకు కంకర వేసి తారు వేయకుండా
వదిలేశారని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారన్న విషయాన్ని
అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సింధువాలం
గాదెమ్మ, ఎంపీటీసీలు శివన్న, మల్లికార్జున, జడ్పీటీసీ బుజ్జమ్మ, ఎంపీడీవో
దాసనాయక్, ఇంచార్జీ ఎమ్మార్వో దీపా, సర్పంచులు హసన్, కొత్తింటి
వెంకట్రామి రెడ్డి పాల్గొన్నారు.