వైసీపీ పాలనలో అక్రమాలు

ABN , First Publish Date - 2022-12-09T23:50:51+05:30 IST

వైసీపీ పాలనలో అక్రమాలు

వైసీపీ పాలనలో అక్రమాలు
పెద్దకడుబూరులో ప్రజలతో మాట్లాడుతున్న తిక్కారెడ్డి

మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి తిక్కారెడ్డి

పెద్దకడుబూరు, డిసెంబరు 9: వైసీపీ పాలనలో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని నియోజకవర్గ ఇన్‌చార్జి తిక్కారెడ్డి అన్నారు. మండలంలోని టీడీపీ రాష్ట్ర రైతు సంఘం అధికార ప్రతినిధి రమాకాంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తే దుల్హన్‌ పథకం కింద ముస్లింలకు రూ.లక్ష ఇస్తామని చెప్పారు. వైసీపీ నాయకులు గర్జనల పేరుతో ప్రజలను మభ్యపెట్టడానికి తెరలేపారన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర బీసీ సాధికారిక కమిటీ సభ్యుడు మల్లికార్జున, టీడీపీ మండల కన్వీనర్‌ బసలదొడ్డి ఈరన్న, టీడీపీ ఏస్సీ సెల్‌ రాష్ట్ర నాయకులు ఏసేబు, మీసేవా ఆంజినేయులు, మధుసూదన్‌ రెడ్డి, సోషల్‌ మీడియా కోర్డినేటర్‌ విజయ్‌రామి రెడ్డి పాల్గొన్నారు.

కర్నూలు(రూరల్‌): వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడుదామని కోడుమూరు టీడీపీ ఇన్‌చార్జి ఆకెపోగు ప్రభాకర్‌ అన్నారు. కర్నూలు రూరల్‌ మండలంలోని బి.తాండ్రపాడులో టీడీపీ మూడో క్లస్టర్‌ ఇన్‌చార్జి పేరపోగు రాజు అధ్యక్షతన శుక్రవారం ఇదేమి కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమం నిర్వహించారు. పార్టీ మండల కన్వీనర్‌ వెంకటేష్‌నాయుడు, బీసీ సెల్‌ అధికార ప్రతినిధి విజయ్‌కుమార్‌తో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, బొగ్గుల భాస్కర్‌, సయ్యద్‌, మాజీ సర్పంచు శ్రీనివాసులు, రామకృష్ణ, వెంకటసుబ్బయ్య కిషోర్‌, యేసు, కిట్టు, సోఫీబేగ్‌, రసూల్‌, తదితరులు పాల్గొన్నారు.

పత్తికొండ(వెల్దుర్తి): రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడుదామని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కేఈ శ్యాంబాబు పిలుపునిచ్చారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వెల్దుర్తి పట్టణంలో 7,8,9 వార్డులలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ మూడున్నరేళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమి లేదన్నారు. ఇసుక మాఫియా, భూదందాలు, సెటిల్‌మెంట్‌లు చేస్తూ ధనార్జనే ధ్యేయంగా అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు శివశంకర్‌రెడ్డి, చర్లకొత్తూరు పుల్లయ్య, సుధాకర్‌గౌడ్‌, అమరనాథ్‌గౌడ్‌, వెంకటరాముడు, జయరాముడు, మంచిరెడ్డిశేషి, బోయ చంద్రుడు, రాఘవేంద్రగౌడ్‌, గోపాల్‌గౌడ్‌, వీరభద్రుడు, ఐజయ్య, బజారి పాల్గొన్నారు.

కోతిరాళ్లలో.. పత్తికొండ మండలం కోతిరాళ్ల గ్రామంలో టీడీపీ నాయకులు రామానాయుడు, శ్రీనివాసులుగౌడ్‌, సోమ్లానాయక్‌, మండల అధ్యక్షుడు సంజప్పల ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ రాష్ర్టానికి కార్యక్రమం నిర్వహించారు. మాజీ సర్పంచ్‌ శిరీషతో కలిసి ఇంటింటికీ తిరిగి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలను ప్రజలకు వివరించారు.

డోన్‌: డోన్‌ నియోజకవర్గంలో మంత్రి బుగ్గన అండతోనే మాఫియా పాలన సాగుతోందని టీడీపీ డోన్‌ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం పట్టణంలోని 6వ వార్డులో టీడీపీ ఆధ్వర్యంలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ పట్టణంలో వైసీపీ నాయకులు మట్కా, అక్రమ మద్యం, వ్యాపారాలతో దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. ఓటమి భయంతోనే మంత్రి బుగ్గన టీడీపీ నాయకులను బెదిరిస్తున్నారని, అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ మురళీకృష్ణగౌడు, జిల్లా అధికార ప్రతినిధి విజయభట్టు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు సీఎం శ్రీనివాసులు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి గంధం శ్రీనివాసులు, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ప్రజా వైద్యశాల మల్లికార్జున పాల్గొన్నారు.

నంద్యాల (నూనెపల్లె): వైసీపీ ప్రభుత్వంలో శాశ్వత పథకాలు దూరమై, శాశ్వత పన్నుల భారంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి అన్నారు. శుక్రవారం ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా నంద్యాలలోని 40వ వార్డులో భూమా బ్రహ్మానందరెడ్డితో పాటు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్‌ పర్యటించారు. వార్డు నేతలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ముందుగా స్థానిక గాంధీచౌక్‌లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, రాష్ట్ర పాలనపై వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లలో అన్ని వర్గాల ప్రజలను దగా చేశారని విమర్శించారు. పట్టణ అధ్యక్షుడు ఖలీల్‌, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-09T23:51:12+05:30 IST