దసరా మహోత్సవాలకు ముఖ్యమంత్రికి ఆహ్వానం

ABN , First Publish Date - 2022-09-17T05:43:19+05:30 IST

శ్రీశైల మహా క్షేత్రంలో ఈ నెల 26 నుంచి అక్టోబరు 5 వరకు అత్యంత వైభవంగా జరగనున్న దసరా మహోత్సవాలు జరగనున్నాయి.

దసరా మహోత్సవాలకు ముఖ్యమంత్రికి ఆహ్వానం
ముఖ్యమంత్రికి స్వామి అమ్మవార్ల చిత్రపటం అందజేసి ఆహ్వానిస్తున్న దేవదాయశాఖ మంత్రి, శ్రీశైలం ఎమ్మెల్యే తదితరులు

శ్రీశైలం, సెప్టెంబరు 16: శ్రీశైల మహా క్షేత్రంలో ఈ నెల 26 నుంచి అక్టోబరు 5 వరకు అత్యంత వైభవంగా జరగనున్న దసరా మహోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, దేవదాయ కమిషనరు ఎం. హరిజవహర్‌లాల్‌, దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్‌ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి ఎస్‌.లవన్న, పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు కలిసి అహ్వానించారు. అలాగే రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌, ఉపముఖ్యంత్రి కొట్టు సత్యనారాయణ, విద్యుత్‌, అటవీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దసరా మహోత్సవాలకు ఆహ్వానించారు. 


Read more