ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన

ABN , First Publish Date - 2022-08-15T05:53:06+05:30 IST

నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా శ్రీశైల దేవస్థానం ఆదివారం సాయంత్రం సంప్రదాయ నృత్యప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.

ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన
నృత్య ప్రదర్శన చేస్తున్న కళాకారులు

 శ్రీశైలం, ఆగస్టు 14: నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా శ్రీశైల దేవస్థానం ఆదివారం సాయంత్రం సంప్రదాయ నృత్యప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆలయ దక్షిణ మాఢవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద నిర్వహించిన సాంస్కృతిక  కార్యక్రమంలో తమిళనాడు రాష్ట్రం కాంచీపురంకు చెందిన వీణావజ్రవేణి వారి బృందం నృత్యప్రదర్శనను ప్రదర్శించారు. వినాయకకౌత్వం, వివతాండవస్తోత్రం, శంభో..శివశంభో తదితర గీతాలకు వీణావజ్రవేణి, సంజన, సంధ్య, అశ్వన, అనుశ్రీ, హర్షిత తదితరులు నృత్యప్రదర్శనతో ఆకట్టుకున్నారు. స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలు సంపూర్ణంగా జరిపించేందుకు, ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ ధర్మపథం కార్యక్రమాన్ని దేవస్థానం నిర్వహిస్తోంది. 

Read more