అక్రమ కట్టడాలను అరికట్టాలి

ABN , First Publish Date - 2022-02-19T05:40:04+05:30 IST

పట్టణంలోని వీవర్స్‌కాలనీ మైదానంలో అక్రమ కట్టడాలను అరికట్టాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నియోజకవర్గ అధ్యక్షుడు మాదిగ నాగరాజు డిమాండ్‌ చేశారు.

అక్రమ కట్టడాలను అరికట్టాలి

టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నియోజకవర్గ అధ్యక్షుడు మాదిగ నాగరాజు

ఎమ్మిగనూరు టౌన్‌, ఫిబ్రవరి18: పట్టణంలోని వీవర్స్‌కాలనీ మైదానంలో అక్రమ కట్టడాలను అరికట్టాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నియోజకవర్గ అధ్యక్షుడు మాదిగ నాగరాజు డిమాండ్‌ చేశారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలో ర్యాలీ నిర్వహించి చేనేత పితామహుడు పద్మశ్రీ మాచాని సోమప్ప విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల కోసం కేటాయించిన క్రీడాస్థలంలో సొంత లాభాల కోసం అక్రమ కట్టడాలను ప్రోత్సహించడం తగదన్నారు. క్రీడా మైదానంలో అక్రమ కట్టడాలను కట్టరాదని ప్రతి ఒక్కరూ ఆందోళన చేస్తుంటే ఎమ్మెల్యే, మున్సిపల్‌ చైర్మన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ పట్టించుకోక పోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో నాయకులు సందీప్‌నాయుడు, మాబాషా, భీమరాయుడు, తాజుద్దీన్‌, నరేష్‌, మునిస్వామి, బేతాలబాషా, రాంపురం రఫీక్‌ పాల్గొన్నారు.

Read more