వైసీపీకి ఓటు వేసి తప్పు చేశాను

ABN , First Publish Date - 2022-09-10T06:54:12+05:30 IST

పింఛన్‌ రద్దు కావడంతో విద్యాసాగర్‌ అనే వికలాంగుడు వైసీపీకి ఓటు వేసి తప్పు చేశానని ఆవేదన చెందాడు.

వైసీపీకి ఓటు వేసి తప్పు చేశాను

పింఛను తొలగించడంతో దివ్యాంగుడి మనోవేదన

కోడుమూరు, సెప్టెంబరు 9: పింఛన్‌ రద్దు కావడంతో విద్యాసాగర్‌ అనే వికలాంగుడు వైసీపీకి ఓటు వేసి తప్పు చేశానని ఆవేదన చెందాడు.  చిన్న వయస్సులోనే విద్యాసాగర్‌కు పోలియో  సోకి కాలు, చెయ్యి పని చేయడం లేదు. అతను అవివా హితుడు. తల్లిదండ్రులు అనారోగ్యంతో  చనిపోయారు. తమ్ముడు ఇంత అన్నం పెడితే తిని కాలం గడుపుతు న్నాను. పింఛన్‌ గత నెల దాకా  అందుకొన్నాను. 88 శాతం దివ్యాంగు డైన ఆయన గత 20 సంవత్సరాలుగా పింఛన్‌ తీసుకుంటున్నాడు   తమ్ముడికి కారు ఉందని తన  పింఛను తొలగించారని విద్యాసాగర్‌ ఆవే దన చెందుతున్నాడు.  విద్యాసాగర్‌ శుక్రవారం ఎంపీడీవో చంద్రశే ఖర్‌ ను  కలిసి ఎలా గైనా పింఛన్‌ ఇప్పిం చాలని వేడుకొన్నాడు. ఇందుకు స్పందిం చిన ఎంపీడీవో పింఛను తొలగింపుపై విచారణ చేపట్టారు.  రేషన్‌ కార్డులో పేరు మార్చుకొంటే  కొత్త పింఛన్‌ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందని ఎంపీడీవో  చెప్పారు. వైసీపీకి ఓటు వేసి చాలా తప్పు చేశాను.. అంటూ విద్యాసాగర్‌ కన్నీళ్లు పెట్టుకొని అక్కడి నుంచి  వెళ్ళిపోయాడు. 

Updated Date - 2022-09-10T06:54:12+05:30 IST