భార్యను హత్య చేసిన భర్త అరెస్టు

ABN , First Publish Date - 2022-04-10T05:47:13+05:30 IST

మండలంలోని డబ్ల్యూ.గోవిందిన్నె గ్రామానికి చెందిన చిల్కూరు లక్ష్మీదేవి (39)ని హత్య చేసిన భర్త చిలమకూరి పుల్లయ్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు.

భార్యను హత్య చేసిన భర్త అరెస్టు

దొర్నిపాడు, ఏప్రిల్‌ 9: మండలంలోని డబ్ల్యూ.గోవిందిన్నె గ్రామానికి చెందిన చిల్కూరు లక్ష్మీదేవి (39)ని హత్య చేసిన భర్త చిలమకూరి పుల్లయ్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం తెల్లవారుజామున 10 గంటల ప్రాంతంలో మంచంపై పడుకున్న భార్య లక్ష్మీదేవిని గొడ్డలితో భర్త హత్య చేశాడు. భార్యపై అనుమానంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సీఐ తెలిపారు. శనివారం ఉదయం కోవెలకుంట్ల మండ లం కంపమల్ల మెట్ట వద్ద నిందితుడు పుల్లయ్యను అరెస్టు చేసి అతడి వద్ద నుంచి హత్య చేసేందుకు వాడిన గొడ్డలిని స్వాధీనం చేసుకొని నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. 

Read more