ముడుమాలలో గౌరవ సభ

ABN , First Publish Date - 2022-02-17T05:14:43+05:30 IST

మండలంలోని ముడుమాల గ్రామంలో బుధవారం మాజీ ఎంపీటీసీ సుంకన్న అధ్వర్యంలో టీడీపీ కార్యకర్తల గౌరవసభ నిర్వహించారు.

ముడుమాలలో గౌరవ సభ

సి. బెళగల్‌, ఫిబ్రవరి 16: మండలంలోని ముడుమాల గ్రామంలో బుధవారం మాజీ ఎంపీటీసీ సుంకన్న అధ్వర్యంలో టీడీపీ కార్యకర్తల గౌరవసభ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కోడుమూరు నియోజక వర్గం టీడీపీ ఇన్‌చార్జి ఆకెపోగు ప్రభాకర్‌ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సి బెళగల్‌ మండలంలో టీడీపీ పాలనలో చేసిన అభివృద్ధి తప్ప వైసీపీ చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు. తుంగభద్ర నది పక్కన ఉన్నా.. ఇసుక తీసుకోలేని పరిస్దితి దాపురించిందని, ఒక ట్రాక్టర్‌కు రూ 4500 చెల్లించాల్సి వస్తోందని అన్నారు. తిమ్మనదొడ్డి మొదలుకొని కర్నూలు వరకు రోడ్లు మోకాలు లోతు గుంతలు పడి ప్రజలు ఇబ్బందిపడుతున్నారని అన్నారు. రోడ్డు ప్రమాదాలలో అనేక మంది మృతి చెందారని అన్నారు. అంధ్రప్రదేశ్‌లో రావణాసుర పాలన నడుస్తోందని అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు స్వస్తి పలికే రోజుల దగ్గరపడ్డాయన్నారు. వచ్చే ఎన్నికలలో కోడుమూరు నియోజకవర్గంలో టీడీపీ జెండాను ఎగురవేస్తామన్నారు. ఈ సమావేశంలో మాజీ మండల కన్వీనర్‌ పాండురంగన్నగౌడు, నాగరాజు, బసన్న, మాజీ ఎంపీటీసీ సుంకన్న, రామరావు, బుడ్డన్న, కుర్వ సంఘం నాయకులు, శ్రీమంతుడు, భీరప్ప, సుంకన్న, అనుమంతు, పోలకల్లు శ్రీను పాల్గొన్నారు.

Read more