దంచి కొట్టిన వాన

ABN , First Publish Date - 2022-10-01T05:05:14+05:30 IST

కర్నూలు జిల్లాలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు వాన దంచి కొట్టింది. దాదాపు అన్ని మండలాల్లో వర్షం వర్షం కురిసింది.

దంచి కొట్టిన వాన
వాన నీటిలో నిలిచిపోయిన బస్సును తోస్తున్న స్థానికులు

  1. ఏకమైన వాగులు, వంకలు
  2. నీట మునిగిన పంటలు 

కర్నూలు(అగ్రికల్చర్‌), సెప్టెంబరు 30:  కర్నూలు జిల్లాలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు వాన దంచి కొట్టింది. దాదాపు అన్ని మండలాల్లో వర్షం వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు ఏకమయ్యాయి. పంట పొలాలు నీట మునిగిపోయాయి. రోడ్లెక్కి నీరు ప్రవహించడంతో బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు కురిసిన వర్షం వల్ల 35.2 మి.మీట వర్ష పాతం నమోదైంది. అత్యధికంగా పెద్దకడుబూరులో 75.2 మి.మీ, అత్యల్పంగా నందవరంలో 24.6 మి.మీ. వర్ష పాతం నమోదైంది. ఈ రెండు రోజుల్లోనే సెప్టెంబరు నెల మొత్తం కురవాల్సిన 116.5 మి.మీ. వర్షపాతానికి గానూ 127.3 మి.మీ. వర్ష పాతం నమోదైంది. మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామంలో ఉల్లి పంట నీట మునిగింది. కోడుమూరు, మంత్రాలయం, పెద్దకడుబూరు, హోళగుంద తదితర మండలాల్లో రోడ్లపై వర్షం నీరు ఉధృతంగా ప్రవహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులపాలయ్యారు.

Read more