‘ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలం’

ABN , First Publish Date - 2022-08-31T06:05:09+05:30 IST

నిత్యావసర సరుకుల ధరలను నియం త్రించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీడీపీ కల్లూరు మండల కన్వీనర్‌ డి.రామాంజనేయులు విమర్శించారు.

‘ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలం’

కల్లూరు, ఆగస్టు 30: నిత్యావసర సరుకుల ధరలను నియం త్రించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీడీపీ కల్లూరు మండల కన్వీనర్‌ డి.రామాంజనేయులు విమర్శించారు. మంగళవారం కల్లూరు మండలం తడకనపల్లె గ్రామంలో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రభుత్వ ప్రజావ్యతిరేక  విధానాలను వివరిస్తూ ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా డి.రామాంజనేయులు మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలపై బస్సు, కరెంట్‌ చార్జీలు, పన్నులు పెంచి పస్తులుండేలా చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో సర్పంచు సహారాబీ, ఉపసర్పంచు వెంక టేష్‌, తౌరియా నాయక్‌, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.


Read more