-
-
Home » Andhra Pradesh » Kurnool » Ghananga Uyyalawada Narasimhareddy Vardhanthi-NGTS-AndhraPradesh
-
ఘనంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి
ABN , First Publish Date - 2022-02-23T05:57:16+05:30 IST
తొలితరం స్వాతంత్య్ర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 175వ వర్ధంతిని మండలంలోని యర్రగుంట్ల గ్రామం లో మంగళవారం ఘనంగా నిర్వహించారు.

శిరివెళ్ల, ఫిబ్రవరి 22: తొలితరం స్వాతంత్య్ర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 175వ వర్ధంతిని మండలంలోని యర్రగుంట్ల గ్రామం లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద ఎంపీటీసీ కమతం జయరామిరెడ్డి, టీడీపీ నాయకులు కమతం పుల్లారెడ్డి, లక్ష్మీరెడ్డి నరసింహారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కమతం సుబ్బారెడ్డి, శీలం లక్ష్మీప్రసాద్, డేగల జనార్దన్, సత్తారు నాగిరెడ్డి, జాకీర్ హుసేన్, జమాల్ బాషా, తాళ్లూరి బుగ్గన్న, షఫి, రామ్మోహన్, నారాయణ, తెలుగు యువత ఉపాధ్యక్షుడు కమతం రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఉయ్యాలవాడ: విప్లవ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి దేశం కోసం చేసిన త్యాగం మరువలేనిదని రేనాటి సూర్యచంద్రుల సేవా సమితి ప్రతినిధి బుడ్డా విశ్వనాథ్‌రెడ్డి అన్నారు. నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటీష్ పాలనను ఎదురించి సాయుధ పోరాటం చేసిన మహోన్నత వ్యక్తిని స్మరించుకోవాలన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఓబులేసు, మాజీ సర్పంచ్ పోచా రాధాకృష్ణారెడ్డి, బాబు పాల్గొన్నారు.
నంద్యాల(కల్చరల్): నంద్యాల సంఘమిత్ర సేవా సమితి ఆవాసంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని నిర్వహించారు. సంఘమిత్ర సంస్ధ అధ్యక్షుడు నాగసుబ్బారెడ్డి అఽధ్యక్షతన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో సుందర్‌రావు, సంఘమిత్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ఆళ్లగడ్డ: బ్రిటీష్ వారిని ఎదురించిన విప్లవ వీరుడు నరసింహారెడ్డి అని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి అమీర్‌బాషా అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఆయన చిత్రపటానికి మంగళవారం పూలమాలలు వేసి నివాళి అర్పించారు.