కదంతొక్కిన ఆశాలు

ABN , First Publish Date - 2022-02-23T06:12:29+05:30 IST

ఆశా వర్కర్లు కదం తొక్కారు. తమ సమస్యల పరిష్కారం కోసం కర్నూలు కలెక్టరేట్‌ వద్ద మంగళవారం ధర్నా చేశారు.

కదంతొక్కిన ఆశాలు
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న ఆశావర్కర్లు

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌

కర్నూలు(కలెక్టరేట్‌/న్యూసిటీ) ఫిబ్రవరి 22: ఆశా వర్కర్లు కదం తొక్కారు. తమ సమస్యల పరిష్కారం కోసం కర్నూలు కలెక్టరేట్‌ వద్ద మంగళవారం ధర్నా చేశారు. ఆశావర్కర్ల గౌరవ అధ్యక్షుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ వర్కర్లకు గౌరవ వేతనం రూ.15 వేలకు పెంచాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సంక్షేమ పథకాలు కొనసాగించాలన్నారు. పని భారం తగ్గించి ప్రభుత్వ సెలవులు, వేతనాలతో కూడిన మెటర్నిటీ సెలవులు అమలు చేయాలన్నారు. కొవిడ్‌ సమయంలో మరణించిన ఆశాల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల ఆర్థిక సాయం వెంటనే అందించాలని డిమాండ్‌ చేశారు. మరణించిన కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు.  తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేకుంటే మార్చి 8న ఛలో విజయవాడ చేపడుతామని హెచ్చరించారు. అనంతరం డీఆర్‌వో పుల్లయ్యకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు శివలక్ష్మి, జిల్లా నాయకులు గోపాల్‌, రమీజాబి, దస్తగిరమ్మ, సరోజ, ఈశ్వరీబాయి, అరుణ, సుబేద, శేషమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-02-23T06:12:29+05:30 IST