పీఠాధిపతికి వీడ్కోలు

ABN , First Publish Date - 2022-03-23T05:43:17+05:30 IST

అహోబిలం పీఠాధిపతి రంగనాఽథయతీంద్ర మహాదేశికన్‌ తిరుపతికి మంగళవారం తన శిష్యబృందంతో బయలు దేరివెళ్లారు.

పీఠాధిపతికి వీడ్కోలు

ఆళ్లగడ్డ, మార్చి 22: అహోబిలం పీఠాధిపతి రంగనాఽథయతీంద్ర మహాదేశికన్‌ తిరుపతికి మంగళవారం తన శిష్యబృందంతో బయలు దేరివెళ్లారు. ఈయన ఈనెల 9న అహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చారు. బ్రహ్మోత్సవాలు తన ఆధ్వర్యంలో ప్రశాంతంగా ముగించారు. అలాగే తెప్పోత్సవం కార్యక్రమాల్లో పాల్గొన్న తరువాత తిరుమలలో ఈ నెల 26న జరిగే వేంకటేశ్వరస్వామి మంగళాశాసనంలో పాల్గొనేందుకు వెళ్లారు. ఈయనకు నంద్యాల మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి, ఈవో నరసయ్య, ప్రధాన అర్చకుడు వేణుగోపాలన్‌, మఠం అధికారి సంపత్‌, వేదపండితులు వీడ్కోలు పలికారు.
Read more