‘అధికారం ఉందని రెచ్చిపోతున్నారు’

ABN , First Publish Date - 2022-01-04T05:20:19+05:30 IST

అధికారం ఉందని వైసీపీ నాయకులు రెచ్చిపో తున్నారని జడ్పీ మాజీ చైర్మన్‌ మల్లెల రాజశేఖర్‌ అన్నారు.

‘అధికారం ఉందని రెచ్చిపోతున్నారు’

ఓర్వకల్లు, జనవరి 3: అధికారం ఉందని వైసీపీ నాయకులు రెచ్చిపో తున్నారని జడ్పీ మాజీ చైర్మన్‌ మల్లెల రాజశేఖర్‌ అన్నారు. గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్‌ విగ్రహం ధ్వంసం చేయడం దుర్మార్గమన్నారు. సోమవా రం మండలం లోని హుశేనాపురం గ్రామంలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రాజశేఖర్‌ మాట్లాడుతూ ఈ ఘాతుకానికి ఒడిగట్టిన వైసీపీ నాయకుడిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీ సులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. వైసీపీ నాయకులు ఇలానే వ్యవ హరిస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు మహబూబ్‌బాషా, ప్రశాంత్‌, సుధాకర్‌, నారాయణ, రాము, బజారు, మాసూం, అన్వర్‌, మాలిక్‌, జయకృష్ణ, వేణు పాల్గొన్నారు.Read more