మాయమాటల జగన్‌

ABN , First Publish Date - 2022-04-24T05:47:21+05:30 IST

మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేయడంలో సీఎం జగన్‌ను మించిన వారు మరొకరు లేరని మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.

మాయమాటల జగన్‌

  1. మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి


ఎమ్మిగనూరు, ఏప్రిల్‌ 23: మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేయడంలో సీఎం జగన్‌ను మించిన వారు మరొకరు లేరని మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం కోటెకల్లు గ్రామంలో గౌరవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మహిళలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం  టీడీపీ జెండాను ఎగురవేశారు. ఎన్టీఆర్‌, బీవీ మోహన్‌రెడ్డిల చిత్రపటాలకు నివాళి అర్పించారు. గౌరవ సభలో బీవీ మాట్లాడుతూ ప్రజలకు అనేక హామీలు ఇచ్చిన జగన్‌ అధికారంలోకి వచ్చాక మాట తప్పారని అన్నారు. చెత్తపై పన్ను వేసిన ఏకైక చెత్త ప్రభుత్వమిది అన్నారు. అనం తరం పట్టణంలోని టీడీపీ మైనార్టీ నాయకుడు మునిరుద్దీన్‌ను మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి శనివారం పరామర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వాల్మీకి శంకరయ్య, మల్లికార్జున, సోమేశ్వరరెడ్డి, నాగయ్య, ముద్దన్నగౌడ్‌, హమీదు, రాముడు, రంగన్న, సురే్‌షచౌదరి పాల్గొన్నారు.Read more