ఉపాధి పనులు వేగవంతం చేయాలి: పీడీ

ABN , First Publish Date - 2022-02-23T05:37:06+05:30 IST

గ్రామాల్లో జాతీయ ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలని డ్వామాపీడీ అమరనాథరెడ్డి కోరారు.

ఉపాధి పనులు వేగవంతం చేయాలి: పీడీ

బనగానపల్లె, ఫిబ్రవరి 22: గ్రామాల్లో జాతీయ ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలని డ్వామాపీడీ అమరనాథరెడ్డి కోరారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలోని పొదుపుభవనంలో బనగానపల్లె, కోవెలకుంట్ల మండలాల ఏపీవోలు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఈసీలు, ఫీల్డు అసిసెంట్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పీడీ రెండు మండలాలకు చెందిన సిబ్బందితో గ్రామాల వారిగా రివ్యూ నిర్వహించారు. పీడీ మాట్లాడుతూ గ్రామాల్లో ఉపాధి హామీ కూలీల సంఖ్యను పెంచాలన్నారు. చాలా గ్రామాల్లో కూలీలకు తక్కువ కూలీ పడుతోందని ప్రతి ఒక్కరికి రోజుకు రూ.240 నుంచి రూ.250లు పడేలా పనులు చేయించాలని ఆదేశించారు. ప్రతి ఒక్క సిబ్బంది తమకు ఇచ్చిన టార్గెనను పూర్తి చేయాలని ఆదేశించారు. బనగానపల్లె మండలంలోని తిమ్మాపురం ఫీల్డ్‌ అసిస్టెంట్‌ సక్రమంగా పనిచేయడం లేదని అతనికి నోటీసులు ఇచ్చి తొలగించాలని పీడీ ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శివరామయ్య, ఏపీడీ సాంబశివరావు, కోర్డు డైరక్టర్‌ పరమేశ్వరుడు, కమిటీ సభ్యుడు పుల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 


Read more