ఈరన్న స్వామి హుండీ ఆదాయం రూ.66 లక్షలు

ABN , First Publish Date - 2022-03-16T05:33:41+05:30 IST

ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానంలో మంగళవారం హుండీ లెక్కించారు. గత నెల రోజులుగా భక్తులు కానుకల రూపంలో చెల్లించిన నగదును డార్మిటరీ హాలులో లెక్కిం చారు.

ఈరన్న స్వామి హుండీ ఆదాయం రూ.66 లక్షలు

కౌతాళం, మార్చి 15:  ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానంలో మంగళవారం హుండీ లెక్కించారు. గత నెల రోజులుగా భక్తులు కానుకల రూపంలో  చెల్లించిన నగదును డార్మిటరీ హాలులో లెక్కిం చారు. రూ.66,52,188 నగదు, 8.9 కేజీల వెండి, 58 గ్రాముల బంగారం వచ్చినట్లు ఆలయ సహాయ కమిషనరు వాణి తెలిపారు. ఆదోని దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు, ఆలయ పర్యవేక్షకులు వెంకటేశ్వర్లు, మల్లికార్జున, కిరణ్‌, ఓబులేష్‌, వీరేష్‌, శివ  పాల్గొన్నారు.

Read more