నేటి నుంచి దసరా సెలవులు

ABN , First Publish Date - 2022-09-24T05:30:00+05:30 IST

ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 26 నుంచి అక్టోబరు 6వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రంగారెడ్డి శనివారం తెలిపారు.

నేటి నుంచి దసరా సెలవులు

అక్టోబరు 7న పునఃప్రారంభం 

కర్నూలు(ఎడ్యుకేషన్‌), సెప్టెంబరు 24: ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 26 నుంచి అక్టోబరు 6వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రంగారెడ్డి శనివారం తెలిపారు. దసరా పండుగ అనంతరం అక్టోబరు 7వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయన్నారు. అయితే క్రిస్టియన మిషనరీ పాఠశాలలకు అక్టోబరు 1 నుంచి 6వ తేదీ వరకు సెలవులు ఉంటాయన్నారు. దసరా సెలవు దినాల్లో పాఠశాలల తరగతుల నిర్వహణ లేకుండా మండల విద్యా శాఖ అధికారులు, ఉప విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డీఈవో ఆదేశించారు.


 


Read more