ఆలయాల అభివృద్ధికి విరాళం

ABN , First Publish Date - 2022-08-15T05:48:24+05:30 IST

మండలంలోని నందవరం చౌడేశ్వరీమాత ఆలయాభివృద్ధికి హైదరాబాద్‌కు చెందిన భరత్‌కుమార్‌ కుటుంబ సభ్యులు ఆదివారం రూ.50వేలు విరాళం ఆలయ ఈవో రామానుజన్‌కు అందించారు.

ఆలయాల అభివృద్ధికి విరాళం

బనగానపల్లె, ఆగస్టు 14: మండలంలోని నందవరం చౌడేశ్వరీమాత ఆలయాభివృద్ధికి హైదరాబాద్‌కు చెందిన భరత్‌కుమార్‌ కుటుంబ సభ్యులు ఆదివారం రూ.50వేలు విరాళం ఆలయ ఈవో రామానుజన్‌కు అందించారు. అలాగే బనగానపల్లె పట్టణంలోని ఆంజనేయస్వామి ఆలయాభివృద్దికి తన తండ్రి మూల సిద్దారెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు రామ్మోహన్‌రెడ్డి ఆదివారం రూ.50వేలు విరాళం అందించారు. ఆలయ కమిటీ సభ్యుడు వెంకటసుబ్బయ్య, మహేశ్వరరెడ్డి, బద్రీనారాయణకు ఈ విరాళాన్ని అందించారు. సుధీర్‌కుమార్‌రెడ్డి, భరత్‌చంద్రారెడి తదితరులు ఉన్నారు.

Read more