వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు

ABN , First Publish Date - 2022-09-10T06:51:52+05:30 IST

మంత్రాలయం పట్టణానికి చెందిన కర్రెప్ప(35) అదృశ్యం అయినట్లు మంత్రాలయం ఎస్‌ఐ వేణు గోపాల్‌ రాజు తెలిపారు.

వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు

మంత్రాలయం, సెప్టెంబరు 9: మంత్రాలయం పట్టణానికి చెందిన కర్రెప్ప(35)  అదృశ్యం అయినట్లు మంత్రాలయం ఎస్‌ఐ వేణు గోపాల్‌ రాజు తెలిపారు.  లైంగిక ఆరోపణ కేసులో కర్రెప్ప నిందితు డుగా ఉంటూ గురువారం ఆదోని కోర్టుకు వాయిదాకు వెళ్లాడు. శుక్రవారం రాత్రి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో బంధువులు ఆ రా తీశారు. అయినా తెలియకపోవడంతో భార్య పార్వతి మంత్రాల యం పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేసింది. అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ  తెలిపారు.Read more