‘విలీనంతో విద్యార్థులకు ఇబ్బందులు’

ABN , First Publish Date - 2022-07-18T06:12:33+05:30 IST

ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులు ఉన్నత పాఠశాలల్లో విలీనంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీ శివయ్య అన్నారు.

‘విలీనంతో విద్యార్థులకు ఇబ్బందులు’

నంద్యాల (నూనెపల్లె), జూలై 17: ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులు ఉన్నత పాఠశాలల్లో విలీనంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీ శివయ్య అన్నారు. నంద్యాలలోని ఏపీటీఎఫ్‌ ప్రాంతీయ కార్యాలయంలో ఆదివారం ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విలీనంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యా ర్థులు, తల్లిదండ్రులు రోడ్లపై వచ్చి ఆందోళన చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించు కోకపోవడం దారుణమన్నారు. జీవో నెంబరు 117ను, ఇలాగే సీపీఎస్‌ను రద్దుచే సి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, గురుకుల పాఠశాలల్లో తెలుగు, ఆంగ్ల మాధ్య మాలను కొనసాగించాలన్నారు. 11వ పీఆర్సీలో ఫిట్‌మెంట్‌ 27శాతానికి తగ్గకుం డా మంజూరు చేయాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయా లని, కరోనాతో మృతిచెందిన ఉపాధ్యాయ కుటుంబాలకు కారుణ్య నియామకాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఏపీజీఎల్‌ఐ, డీఏ బకాయిలు, సంపాధిత సెలవులు, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులు, గత కాలపు అరియర్స్‌ వెంటనే చెల్లించాలన్నారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్లు భాస్కరరెడ్డి, సభ్యులు వీరేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read more