మంత్రాలయానికి పోటెత్తిన భక్తులు

ABN , First Publish Date - 2022-10-04T05:51:27+05:30 IST

రాఘవేంద్రస్వామి దర్శనార్థం సోమవారం మంత్రాలయానికి భక్తులు పోటెత్తారు.

మంత్రాలయానికి పోటెత్తిన భక్తులు
మఠం ప్రాంగణంలో భక్తుల రద్దీ

మంత్రాలయం, అక్టోబరు 3: రాఘవేంద్రస్వామి దర్శనార్థం సోమవారం మంత్రాలయానికి భక్తులు పోటెత్తారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని రాఘవేంద్రస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. రథోత్సవాల ఊరేగింపులో పాల్గొన్నారు. ప్రధాన రహదారులన్నీ భక్తులతో నిండిపోయాయి. మఠం ప్రాంగణం అశేష జనవాహినితో కిక్కిరిసింది. 


Read more