దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-09-27T05:52:54+05:30 IST

దేవీ నవరాత్రులు సోమవారం నగరంలోని వివిధ అమ్మవారి ఆలయాల్లో వైభవంగా ఆరంభమయ్యాయి.

దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
చిన్న అమ్మవారిశాలలో పూజలు చేస్తున్న టీజీ దంపతులు

ఆలయాల్లో అమ్మవారికి విశేష అలంకరణలు

కర్నూలు(కల్చరల్‌), సెప్టెంబరు 26:  దేవీ నవరాత్రులు సోమవారం నగరంలోని వివిధ అమ్మవారి ఆలయాల్లో వైభవంగా ఆరంభమయ్యాయి.  స్థానిక మించిన్‌ బజార్‌లోని పెద్ద అమ్మవారిశాలలో   గణపతి హోమం, నవ గ్రహ హోమం  నిర్వహించారు. సాయంత్రం అమ్మవారు బాలత్రిపుర సుందరి గా భక్తులకు దర్శనమిచ్చారు. నగరంలోని పూజబజార్‌ చిన్న అమ్మవారిశాలలో రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ దంపతుల పూజలు చేశారు. ఆలయ కమిటీ ప్రతినిధులు టీజీ  దంపతులకు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.  చిన్నారి బాలికలు చేసిన నృత్య రూపకాలు ఆకట్టుకున్నాయి.  స్థానిక వన్‌టౌన్‌లోని నిమిషాంబ ఆలయంలో  అమ్మవారికి నిమిషాం బాదేవి అలంకరణ చేశారు. వన్‌టౌన్‌ కాళికాంబ దేవాలయంలో బాలత్రిపుర సుందరి అలంకరణ చేశారు. పాతనగరంలోని గీతామందిరంలో అమ్మవారికి కామాక్షి దేవి అలంకరణ చేశారు.  సప్తగిరినగర్‌ (కేసీ కెనాల్‌) సమీపంలోని శ్రీ మణికంఠ అయ్యప్పస్వామి దేవాలయం ఆవరణలో ఉన్న చౌడేశ్వరి మాతా గుడిలో  అమ్మవారు బాలత్రిపుర సుందరి దేవిగా   భక్తులకు దర్శనమిచ్చారు. 

ఓర్వకల్లు: మండలంలోని గ్రామాల్లో  సోమవారం శరన్నవరాత్రులు పారం భమయ్యాయి. హుశేనాపురం గ్రామంలో ప్రతిష్టించిన దుర్గాదేవి అమ్మవారి విగ్రహానికి మాజీ జడ్పీ చైర్మన్‌ మల్లెల రాజశేఖర్‌ దంపతులు పూజలు చేశారు.   ఓర్వకల్లులోని చౌడేశ్వరి దేవి, సుంకులమ్మ అమ్మవార్లకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. రాగమయూరిలో ఉన్న సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు.

కోడుమూరు: 
పట్టణంలోని వల్లెలాంబదేవి, వాసవీ కన్యకాపరమేశ్వరి, కాళి కాదేవి, చెన్నకేశస్వామి, శ్రీరాములవారి దేవాలయంలో దేవి నవరాత్రుల ఉత్సవ కార్యక్రమాలు సోమవారం ఘనంగా ప్రారంభించారు.  ఈ ఆలయాల్లో అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇచ్చారు.

కోడుమూరు(రూరల్‌):
మండలంలోని వర్కూరు  లక్ష్మీమాధవస్వామి ఆల యంలో   అమ్మవారి విగ్రహాన్ని విశేషంగా అలంకరించి పూజలు  చేశారు.  ఈ కార్యక్రమంలో మధు, నరేష్‌, అయ్యస్వామి, పవన్‌, అశోక్‌, రాముడు  పాల్గొన్నారు. 

గూడూరు: 
గూడూరులో సుంకులాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారు పార్వతీదేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు.  కె నాగలాపురంలోని సుంకులా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో గణపతి పూజ, హోమం చేశారు.   సుంకు లాపరమేశ్వరి పార్వతీదేవిగా  దర్శనం ఇచ్చారు.


Read more