సీజ్ చేసిన మద్యం ధ్వంసం
ABN , First Publish Date - 2022-11-30T00:25:40+05:30 IST
ఎమ్మిగనూరు సెబ్ స్టేషన పరిధిలో పట్టుబడిన మద్యాన్ని మంగళవారం ఎమ్మిగనూరు సెబ్ పోలీసులు ధ్వంసం చేశారు.

ఎమ్మిగనూరు, నవంబరు 29: ఎమ్మిగనూరు సెబ్ స్టేషన పరిధిలో పట్టుబడిన మద్యాన్ని మంగళవారం ఎమ్మిగనూరు సెబ్ పోలీసులు ధ్వంసం చేశారు. సెబ్ సీఐ జయరామ్ నాయుడు తెలిపిన వివరాల మేరకు ఎమ్మిగనూరు సెబ్ స్టేషన పరిధిలో 162 కేసులలో 44,788 ఒరిజినల్ చాయిస్ విస్కీ కర్ణాటక టెట్రా పాకెట్ల మద్యాన్ని వెంకటగిరి రోడ్డులో రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేయడమైందన్నారు. మద్యం విలువ రూ. 16,25,000 ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ సోమశేఖరరావు, హెచసీలు గోపాల్,రబ్బాని, అశ్వర్థరెడ్డి, ఈసీలు నరసింహారెడ్డి పాల్గొన్నారు.
న్నారు.
Read more