కూల్చారు.. వదిలేశారు

ABN , First Publish Date - 2022-09-17T05:47:40+05:30 IST

నరసింహారెడ్డి నగర్‌లో రోడ్డు నిర్మాణం పేరుతో సుమారు అర కిలోమీటర మేర ఇళ్లను కూల్చేశారు.

కూల్చారు.. వదిలేశారు
ఇళ్లను కూల్చడంతో మిగిలిన రాళ్లు, రప్పలు

నరసింహారెడ్డినగర్‌ వాసుల అవస్థలు

కర్నూలు(న్యూసిటీ), సెప్టెంబరు 16: నరసింహారెడ్డి నగర్‌లో రోడ్డు నిర్మాణం పేరుతో సుమారు అర కిలోమీటర మేర ఇళ్లను కూల్చేశారు. కేవీఆర్‌ కళాశాల ఎదురుగా విద్యుత్‌ శాఖ కార్యాలయం వెనుక భాగం నుంచి కేసీ కెనాల్‌ వెంట రోడ్డు వేయాలని మార్చి 28న ఇళ్లను కూల్చేశారు. అప్పటి నుంచి అక్కడ మొండి గోడలు దర్శనమిస్తున్నాయి. సుమారు 20 అడుగుల రోడ్డు నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మేరకు 20 అడుగుల రోడ్డు కోసం ఏవి అడ్డం వస్తే వాటిని బుల్డో జర్‌తో ధ్వంసం చేసుకుంటూ పో యారు. పేదల ఇళ్లు, చెట్లు, బాత్‌రూమ్‌లు అన్నింటిని కూల్చిపడేశారు. నెల రోజు ల్లో పనులు ప్రారంభి స్తా మని చెప్పి ఆరు నెల లైనా పట్టించుకోలేదు. చివరికి చేసేదిలేక తాత్కా లికంగా తడికెలు, రేకులతో బాత్‌ రూమ్‌లు, మరుగు దొడ్లను ఏర్పాటు చేసుకున్నారు.


పాములు, తేళ్లతో సావాసం..

రోడ్డు నిర్మాణం కోసం ఇళ్లను కూలగొట్టడంతో ఆ ప్రాంతంలో చెట్లు పెరిగి పాములు, తేళ్లతో సావాసం చేయాల్సిన పరిస్థితి నెలకొందని స్థాని కులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజూ కేసీ కెనాల్‌ నుంచి పెద్ద పెద్ద గండ్ర తేళ్లు ఇళ్లలోకి వస్తున్నాయని చెబుతున్నారు. విషకీటకాలతో ఎప్పుడు ఎటువంటి ప్రమాదం ముంచుకోస్తుందో అని స్థానికులు బెంబే లెత్తుతున్నారు. ఇళ్లను కూల్చిన సమయంలో గతంలో వేసి అమృత్‌ కొళాయి పైపులు అన్ని బయటే ఉన్నాయి. ఏదైనా వాహనం వాటిపై వెళితే అవి పగిలిపోయి నీరు వృథా అయ్యే అవకాశం ఉంది.

వాంతులు, బేదులు పెడితే ఎక్కడికి పోవాలి..

మరుగుదొడ్లను కూల్చేశారు. వాంతులు, బేదులు పెడితే ఎక్కడికి పోవాలి. పడగొ ట్టేవాళ్లు అప్పటికప్పుడే కట్టాలి. ప్రభుత్వం నుంచి డబ్బులు రాలేదని చెప్పడం ఏమిటి.. కూల్చిన చోట సగం వరకు మట్టి ఎత్తేశారు. మరి మా ఇంటిదగ్గర రాళ్లు, రప్పలు అట్లాగే ఉన్నాయి. వాటిని ఎప్పుడు తీస్తారో..రోడ్డు ఎప్పుడు వేస్తారో అర్థం కావడం లేదు. మా కార్పొరేటర్‌ ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటే. ఇంత జరుగుతున్న ఒక్క నాడు ఇటు పక్క వచ్చి చూడలేదు.
- మరియమ్మ, స్థానికురాలు

రోడ్డు వేసి పుణ్యం కట్టుకోండి..

ఆరు నెలల క్రితం కూల్చేసిన ఇళ్లకు బదులుగా రోడ్డు వేస్తామని చెప్పారు. ఇంత వరకు ఒక్కరు కూడా రాలేదు. రోడ్డు వేయలేదు. దయచేసి రోడ్డు వేసి పుణ్యం కట్టుకోండి. ప్రతి రోజు భయంతో గడుపుతున్నాం. మా గోడు ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదు.
- రామేశ్వరి, స్థానికురాలు

అధికారులను పంపిస్తాం

ఇళ్లు కూల్చిన విషయం తెలియదు. ఈ విషయాన్ని డీఈ, ఏఈల దృష్టికి తీసుకెళ్లి పర్యవేక్షిస్తాం. అక్కడ ఏమి జరిగిందో విచారణ చేయించి సరైన నిర్ణయం తీసుకుంటాం
- శేషసాయి, ఎస్‌ఈ, నగర పాలక సంస్థ


Read more