హత్య కేసులో నిందితుడి అరెస్టు

ABN , First Publish Date - 2022-01-04T05:22:48+05:30 IST

మున్సిపాల్టీ పరిధిలోని పి.చింతకుంట మాజీ సర్పంచు ఇంజేటి క్రిష్ణారెడ్డి హత్య కేసులో 13వ నిందితుడిగా ఉన్న అదే గ్రామానికి చెందిన పక్కీర్‌సా కుమారుడు పక్కీర్‌ పెద్దవలిని సోమవా రం అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ కృష్ణయ్య తెలిపారు.

హత్య కేసులో నిందితుడి అరెస్టు

ఆళ్లగడ్డ్డ, జనవరి 3: మున్సిపాల్టీ పరిధిలోని పి.చింతకుంట మాజీ సర్పంచు ఇంజేటి క్రిష్ణారెడ్డి హత్య కేసులో 13వ నిందితుడిగా ఉన్న అదే గ్రామానికి చెందిన పక్కీర్‌సా కుమారుడు పక్కీర్‌ పెద్దవలిని సోమవా రం అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ కృష్ణయ్య తెలిపారు. ఈ హత్య 2012లో జరిగిందని, అప్పటి నుంచి నిందితుడు తప్పించుకొని ఒరిస్సా రాష్ట్రంలోని కలహాండిలో కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడని చెప్పారు. ఇతనిపై ఆళ్లగడ్డ జిల్లా జడ్జి అరెస్టు వారెంటు జారీ చేశారని చెప్పారు. ఇతన్ని అరెస్టు చేసేందుకు పట్టణ ఎస్‌ఐ సత్యనారాయణ, పీసీ వెంకటేశ్వర్లు, హెచ్‌జీ గిరి సమాచారం సేకరించి పట్టుకున్నారని చెప్పారు. వీరిని డీఎస్పీ రాజేంద్ర అభినందిస్తూ, రివార్డు ఇచ్చారని చెప్పారు. నిందితుడిని కోర్టులో హాజరు పరచి రిమాండ్‌కు తరలించామన్నారు.Read more