మహిళా కూలీ మృతి

ABN , First Publish Date - 2022-09-10T06:51:01+05:30 IST

పట్టణంలో జరుగుతున్న జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో ఉన్న గంగమ్మ అనే కూలీపై రివర్స్‌లో ఎస్‌ఆర్‌కే కంపెనీ లారీ దూసుకెళ్లింది.

మహిళా కూలీ మృతి

ఆలూరు, సెప్టెంబరు 9: పట్టణంలో జరుగుతున్న జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో ఉన్న గంగమ్మ అనే కూలీపై రివర్స్‌లో  ఎస్‌ఆర్‌కే కంపెనీ లారీ దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి  తీసుకు వెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. మృతురాలు తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లా, ఆత్మకూరు మండలం బిట్లమల్లి గ్రామస్థురాలు. 


Read more