యువకుడి మృతి

ABN , First Publish Date - 2022-08-18T05:03:40+05:30 IST

నందికొట్కూరు సమీపంలోని పంటపొలాల్లో బుధవారం ఓ యువకుడు మృతి చెందారు.

యువకుడి మృతి

 నందికొట్కూరు రూరల్‌, ఆగస్టు 17: నందికొట్కూరు సమీపంలోని పంటపొలాల్లో బుధవారం ఓ యువకుడు  మృతి చెందారు. పట్టణంలోని పగిడ్యాల రోడ్డులోని బైరెడ్డి రాజశేఖరెడ్డి నగర్‌కు చెందిన కుర్వ రవితేజ (22) ఆటో నడుపుకొని జీవనం సాగించేవాడు. పంట పొలాల్లో చెట్టుకు ఉరివేసుకొని ఉన్నాడు. ఘటనా స్థలాన్ని నందికొట్కూరు సీఐ సుధాకరెడ్డి, ఎస్‌ రమణ పరిశీలించారు. వీఆర్వో వెంకటేశ్వర్లు కూడా పరిశీలించారు. వారు మాట్లాడుతూ శవానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం చేసేందుకు పంపుతున్నామని తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టులు వచ్చిన తర్వాత విషయం తేలుతుందన్నారు.


  

Read more