మూడో సిజేరియన్‌తో ప్రమాదం

ABN , First Publish Date - 2022-11-11T23:08:46+05:30 IST

వరుసగా మూడు, నాలుగు సిజేరియన్‌లు చేయడం వల్ల తల్లి, బిడ్డకు ప్రమాదం ఏర్పడే ప్రమాదం ఉందని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి గైనిక్‌ విభాగాధిపతి డా.ఎస్‌.వెంకటరమణ తెలిపారు.

మూడో సిజేరియన్‌తో ప్రమాదం

హైరిస్క్‌ గర్భిణులు ముందే అడ్మిట్‌ కావాలి

కర్నూలు జీజీహెచ్‌ గైనిక్‌ హెచ్‌వోడీ డా.ఎస్‌.వెంకటరమణ

కర్నూలు(హాస్పిటల్‌), నవంబరు 11: వరుసగా మూడు, నాలుగు సిజేరియన్‌లు చేయడం వల్ల తల్లి, బిడ్డకు ప్రమాదం ఏర్పడే ప్రమాదం ఉందని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి గైనిక్‌ విభాగాధిపతి డా.ఎస్‌.వెంకటరమణ తెలిపారు. ఈ నెల 2వ తేదీ ఎమ్మిగనూరు మండలానికి చెందిన ఓ గర్బిణీ మూడో సిజేరియన్‌ కోసం కర్నూలు జీజీహెచ్‌లో అడ్మిట్‌ అయ్యారని, మాయ అతుకుపోవడం, అడ్డంగా ఉండటంతో కష్టసాధ్యంగా మారిందని చెప్పారు. అయినా సిజేరియన్‌ చేసినట్లు తెలిపారు. ఇలాంటివి గత 30 రోజుల్లో నాలుగు నుంచి ఐదు కేసులు రావడం ఆందోళన కలిగిస్తోందన్నారు. మొదటి రెండు కాన్పులు సిజేరియన్‌ చేయించుకున్న గర్భిణులు మూడు, నాలుగో కాన్పులు సిజేరియన్‌ అయితే ఆలోచించుకోవాలన్నారు. ఇలాంటి కేసుల్లో మాయ గర్భసంచికి అతుకుటుందని, ఇది ప్రమాదమని అన్నారు. ముఖ్యంగా వరుసగా రెండు సిజేరియన్‌లు చేయించుకుని, మూడు నాలుగో సిజేరియన్‌ కోసం సిద్ధంగా ఉన్న గర్ణిణులు, బీపీ ఉన్నవారు డెలివరీ డేట్‌కు రెండు వారాల ముందే ఆసుపత్రిలో అడ్మిట్‌ కావాలని సూచించారు. హైరిస్క్‌ గర్బిణులను ఆసుపత్రిలో ముందే చేర్చేలా ఏఎన్‌ఎంలు, ఆశాలు, అంగన్‌వాడీ కార్యకర్తలు కృషి చేయాలన్నారు.

Updated Date - 2022-11-11T23:08:51+05:30 IST