భవన నిర్మాణాలు మొదలు పెట్టాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-08-31T06:04:23+05:30 IST

భవన నిర్మాణాలను మొదలు పెట్టాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు పంచాయతీరాజ్‌శాఖ ఈఈ, డీఈలను ఆదేశించారు.

భవన నిర్మాణాలు మొదలు పెట్టాలి: కలెక్టర్‌

 కర్నూలు(కలెక్టరేట్‌), ఆగస్టు 30:  భవన నిర్మాణాలను మొదలు పెట్టాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు పంచాయతీరాజ్‌శాఖ ఈఈ, డీఈలను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో గ్రామ సచి వాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లీనిక్‌ భవన నిర్మా ణాలు, నాడు-నేడు, హౌసింగ్‌ పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 1,257 ప్రయారిటీ భవనాలు మంజూరైతే అందులో కొన్ని మండలాల్లో 22 ప్రయా రిటీ భవనాల నిర్మాణం మొదలు పెట్టలేదని, సెప్టెంబరు 2 నాటికి ఖచ్చితంగా పనులు మొదలు పెట్టాలని అన్నారు. పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ సుబ్రహ్మణ్యం, డీఈవో రంగారెడ్డి, సమగ్ర శిక్ష పీవో వేణుగోపాల్‌, హౌసింగ్‌ పీడీ వెంకట నారాయణ పాల్గొన్నారు.

Read more