-
-
Home » Andhra Pradesh » Kurnool » Conspiracy to undermine primary education-MRGS-AndhraPradesh
-
‘ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేసేందుకు కుట్ర’
ABN , First Publish Date - 2022-04-25T05:01:09+05:30 IST
ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్రపన్నుతోందని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు గోకారి, రాష్ట్ర నాయకులు నాగరాజు, ప్రసన్నరాజు అన్నారు.

ఆదోని(అగ్రికల్చర్), ఏప్రిల్ 24: ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్రపన్నుతోందని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు గోకారి, రాష్ట్ర నాయకులు నాగరాజు, ప్రసన్నరాజు అన్నారు. ఆదివారం మున్సిపల్ హైస్కూల్‌లో జిల్లా గౌరవ అధ్యక్షుడు రమేష్ అధ్యక్షతన కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా విద్యాహక్కు చట్టం నిబంధనలు జీవో నం.85ను సవరణ చేస్తూ జీవో నంబ.20 జారీ చేయడం దారుణమన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం 14 ఏళ్లలోపు పిల్లలను కిలోమీటర్లలోపు పాఠశాలలు ఉండాలని సూచిస్తున్నా ప్రాథమిక పాఠశాలలు ఎత్తివేయడం ప్రభుత్వానికి సబబు కాదన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు షణ్ముమూర్తి, నాయకులు నరసింహులు, నాగేంద్రప్ప, సోమశేషాద్రిరెడ్డి, సుంకన్న, వీరచంద్రయాదవ్, రవి, రామాంజి, వెంకబ, మహాదేవ, చిరంజీవిరెడ్డి, గోపాల్, నారాయణ పాల్గొన్నారు.