క్యాజువాల్టీలో గందరగోళం

ABN , First Publish Date - 2022-03-19T05:08:34+05:30 IST

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి అత్యవసర విభాగం (క్యాజువాల్టీ)లో శుక్రవారం రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

క్యాజువాల్టీలో గందరగోళం

 విధులకు హాజరుకాని హౌస్‌ సర్జన్లు

కర్నూలు(హాస్పిటల్‌), మార్చి 18: కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి అత్యవసర విభాగం (క్యాజువాల్టీ)లో శుక్రవారం రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోగులకు క్యాత్‌లు, ఇంజెక్షన్లు వేసే హౌస్‌సర్జన్లు రాత్రి 9 గంటలైనా విధులకు రాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ప్రమాదంలో గాయపడ్డ రోగులు, ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న అత్యవసర రోగులను చూసే వారు లేకపోవడం క్యాజువాల్టీ సీఎంవో డా.చిన్నన్న, నర్సులే ఓపీలను నిర్వహించారు.

Read more