‘ఉమ్మడి సర్వీస్‌ రూల్స్‌ విడుదల చేయాలి’

ABN , First Publish Date - 2022-08-22T05:17:04+05:30 IST

మున్సిపల్‌ కార్పొరేషన ఉపాధ్యాయులకు ఉమ్మడి సర్వీస్‌ రూల్స్‌ విడుదల చేయాలని ఎస్టీయూ రాష్ట కౌన్సిలర్‌ లోక్యా నాయక్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

‘ఉమ్మడి సర్వీస్‌ రూల్స్‌ విడుదల చేయాలి’

ఆదోని అగ్రికల్చర్‌, ఆగస్టు 21: మున్సిపల్‌ కార్పొరేషన ఉపాధ్యాయులకు ఉమ్మడి సర్వీస్‌ రూల్స్‌ విడుదల చేయాలని ఎస్టీయూ రాష్ట కౌన్సిలర్‌ లోక్యా నాయక్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం నెహ్రూ మెమోరియల్‌ పాఠశాలలో ఎస్టీయూ పట్టణ ప్రధాన కార్యదర్శి వేరు చంద్ర యాదవ్‌ అధ్యక్షతన రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ సమస్యల పట్ల నిర్లక్ష్యం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి సర్వీస్‌ రూల్స్‌ ఏర్పాటు చేసి అందుకు అనుగుణంగా జిల్లా పరిషత ఉపాధ్యాయులతో పాటు బదిలీలు, పదోన్నతుల షెడ్యూలును వెంటనే ప్రకటించాలన్నారు. మున్సిపాల్‌ పాఠశాలలో పని చేస్తున్న ప్రధానోపాధ్యాయులకు డీడీవో అధికారాలు ఇవ్వాలని కోరారు. నాన టీచింగ్‌ స్టాఫ్‌ను కొనసాగించాలన్నారు. అర్భన ఎడ్యుకేషనల్‌ అధికారిని నియమించాలన్నారు. జిపేఎఫ్‌ సౌకర్యం కల్పించి ఆగస్టు నెల జీతాలు ఆలస్యం కాకుండా పాత పద్దతిలోనే చెల్లించాలని కోరారు. సమావేశంలో నాయకులు ప్రహల్లాద, సుధాకర్‌, రామయ్య, ప్రసాద్‌, కళ్యాణ్‌, భీమరాజు, నగేష్‌, మనోహర్‌, కళ్యాణి, అపర్ణ, సువర్ణ, కొండమ్మ, సులక్షణ, శ్యామలాదేవి, ముంతాజ్‌ బేగం, పాల్గొన్నారు.

Updated Date - 2022-08-22T05:17:04+05:30 IST