‘స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయాలి’

ABN , First Publish Date - 2022-08-11T04:49:54+05:30 IST

నగరంలో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయాలని సీపీఎం నగర కార్యదర్శి ఎం.రాజశేఖర్‌ డిమాండ్‌ చేశారు.

‘స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయాలి’

కర్నూలు(న్యూసిటీ), ఆగస్టు 10: నగరంలో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయాలని సీపీఎం నగర కార్యదర్శి ఎం.రాజశేఖర్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం నగర పాలక సంస్థ  కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రాజశేఖర్‌ మాట్లాడుతూ వారం రోజులుగా తాగునీటిలో కెమికల్‌ ఎక్కువగా ఉండటంతో నీరు దుర్వాసన వస్తోందన్నారు. దీని వల్ల ప్రజల ప్రాణాలకు నష్టం కలుగుతుందని వాపోయారు. ప్రజలు ఆసుపత్రి పాలైతే నగర మేయర్‌, కమిషనర్‌, ఎమ్మెల్యేలు బాధ్యత వహించాలని అన్నారు. చెత్త పన్ను వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ మంచినీటి సరఫరా చేయడంలో చూపించాలని హితవు పలికారు. లేనిపక్షంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నగర కార్యదర్శివర్గ సభ్యులు మహ్మద్‌షరీఫ్‌, అబ్దుల్లా, నాగరాజు, కే రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు. 

ఫ కార్పొరేషన అధికారులు నిర్ల్యక్షాన్ని విడనాడి ప్రజలకు దుర్వాసన లేని నీటిని సరఫరా చేయాలని సీపీఎం నగర కార్యదర్శి టి.రాముడు కోరారు. అశోక్‌నగర్‌లోని వాటర్‌ పంప్‌హౌస్‌లో ఫిల్టర్‌ బెడ్లు, ఫిల్టరేషన ప్లాంట్లను సీపీఎం బృందం పరిశీలించింది. కార్యక్రమంలో నాయకులు సీహెచ.సాయిబాబ, కే సుధాకరప్ప, శంకర్‌, రఫిక్‌, ఏసు, భాస్కర్‌ పాల్గొన్నారు. 


Read more