మహానందిలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి

ABN , First Publish Date - 2022-03-19T04:29:01+05:30 IST

మహానంది క్షేత్రంలో శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాధాకృష్ణ కృపాసాగర్‌, ఆయన సతీమణి జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి అనంతలక్ష్మి సత్యవతి కుటుంబసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మహానందిలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి


మహానంది, మార్చి 18: మహానంది క్షేత్రంలో శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాధాకృష్ణ కృపాసాగర్‌, ఆయన సతీమణి జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి అనంతలక్ష్మి సత్యవతి కుటుంబసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయం ముఖద్వారం వద్ద ఆలయ ఈవో చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన ఆలయాల్లో న్యాయమూర్తి దంపతులు స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చన పూజలను భక్తి శ్రద్ధలతో జరిపారు. ఆలయం ప్రాంగణంలోని కల్యాణ మంటపంలో వీరిని వేదపండితులు, ఈవో, పాలకమండలి చైర్మన కొమ్మా మహేశ్వరరెడ్డి ఆశీర్వదించారు. స్వామి ప్రసాదాలు, శాలువాతో సన్మానించారు. వీరి వెంట ఆలయ ఏఈవో ఎర్రమల్ల మధు, టెంపుల్‌ ఇనస్పెక్టర్‌ నాగరాజు, నంద్యాల రూరల్‌ సీఐ రవీంద్ర, ఎస్‌ఐ నాగార్జునరెడ్డి పాల్గొన్నారు.


Read more