‘ఉపాధ్యాయుల బదిలీ షెడ్యూల్‌ను ప్రకటించాలి’

ABN , First Publish Date - 2022-10-12T05:44:52+05:30 IST

ఉపాధ్యాయుల అన్ని కేటగిరీల బదిలీల షెడ్యూల్‌ను ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడు కరెకృష్ణ డిమాండ్‌ చేశారు.

‘ఉపాధ్యాయుల బదిలీ షెడ్యూల్‌ను ప్రకటించాలి’

కర్నూలు(ఎడ్యుకేషన్‌), అక్టోబరు 11: ఉపాధ్యాయుల అన్ని కేటగిరీల బదిలీల షెడ్యూల్‌ను ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడు కరెకృష్ణ డిమాండ్‌ చేశారు. మంగళవారం స్థానిక డీటీఎఫ్‌ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సం దర్భంగా కరెకృష్ణ మాట్లాడుతూ ఉర్దూ పాఠశాలల ఉపాధ్యాయుల జీతాలు వెంటనే చెల్లించాల న్నారు. కర్నూలు నగరంలో 9 పాఠశాలల ఉపాధ్యా యులకు ఇంత వరకు సెప్టెంబరు నెల జీతాలు చెల్లించలేదన్నారు. వెంటనే వారికి జీతాలు చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికా రులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం గత మూడు సంవత్సరాల నుంచి పెండిం గ్‌లో ఉన్న కరువు భత్యం, అరియర్స్‌ను చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈసమావేశంలో డీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కోట్ల చంద్రశేఖర్‌, రాష్ట్ర కౌన్సిలర్‌ బాషా, డీటీఎఫ్‌ బాధ్యులు ఈశ్వర్‌ రెడ్డి, రంగస్వామి పాల్గొన్నారు.

Read more