అన్నదానం గొప్పది

ABN , First Publish Date - 2022-09-20T05:16:07+05:30 IST

అన్ని దాన్నాల కన్న అన్న దానం గొప్పది అని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి అన్నారు

అన్నదానం గొప్పది

టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల

సీ బెళగల్‌, సెప్టెంబరు 19: అన్ని దాన్నాల కన్న అన్న దానం గొప్పది అని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి అన్నారు. సోమవారం సీ బెళగల్‌ మండల కేంద్రంలో టీడీపీ మండల కన్వీనర్‌ గోవిందుగౌడు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్‌ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. నవరత్నాల పేరుతో పేద ప్రజలను మోసం చేయడం తప్ప మరొకటి లేదన్నారు. అన్న క్యాంటీన్లను రద్దు చేయడంతో పేదల ఉసురు కొట్టుకుందన్నారు. మండల కేంద్రంలో అన్న క్యాంటిన్‌ ఏర్పాటు చేసి పేదలకు భోజనాలు వడ్డించారు. కార్యక్రమంలో కోడుమూరు ఇన్‌చార్జి ఆకెపోగు ప్రభాకర్‌, తాలుకా బీసీసెల్‌ నాయకుడు కొండాపురం చిన్నప్రభు, మాజీ సర్పంచు వసుంధరమ్మ, ఆదిత్యరెడ్డి, టీడీపీ మండల కన్వీనర్‌ గోవిందుగౌడు, అయ్యస్వామి, జిల్లా రైతుసంఘం నాయకుడు పాండురంగన్నగౌడు, గిడ్డయ్యగౌడు, గూడురు మండల టీడీపీ నాయకులు సుధాకర్‌రెడ్డి, గజేంద్రగోపాల్‌, సలీమ్‌శంకర్‌, ఎంపీటీసీలు రవికుమార్‌ పాల్గొన్నారు.

Read more