వైభవంగా ద్వాదశి వేడుకలు

ABN , First Publish Date - 2022-08-25T05:53:53+05:30 IST

వేదపండితుల మంత్రోచ్ఛారణాలు, మంగళవాయి ద్యాల మధ్య ద్వాదశి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.

వైభవంగా ద్వాదశి వేడుకలు

మంత్రాలయం, ఆగస్టు 24: వేదపండితుల మంత్రోచ్ఛారణాలు, మంగళవాయి ద్యాల మధ్య ద్వాదశి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచి పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆధ్వర్యంలో రాఘవరాయని బృందావనానికి విశేష పంచామృతాభిషేకం, అష్టోదకం, అలంకరణ చేసి మహా మంగళహారతులు ఇచ్చారు. ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలకు పాదపూజ చేసి పల్లకిలో ఊరేగించారు. బంగారు రథంపై స్వామివారిని అధిష్టించి ఆలయ ప్రాంగణం చుట్టూ ఊరేగించారు. అనంతరం నిర్వహించిన ఊంజల సేవ భక్తులను ఆకట్టుకుంది. వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

Read more