బాలిక మాయంపై కేసు నమోదు

ABN , First Publish Date - 2022-02-23T06:00:25+05:30 IST

కాల్వ గ్రామ సమీపాన ఉన్న పుట్టగొడుగుల పరిశ్రమలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో తప్పిపోయిన బాలిక విషయంలో మిస్సింగ్‌ కేసు నమోదు చేసినట్లు ఓర్వకల్లు ఎస్‌ఐ మల్లికార్జున మంగళవారం తెలిపారు.

బాలిక మాయంపై కేసు నమోదు

ఓర్వకల్లు, ఫిబ్రవరి 22:  కాల్వ గ్రామ సమీపాన ఉన్న పుట్టగొడుగుల పరిశ్రమలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో తప్పిపోయిన బాలిక విషయంలో మిస్సింగ్‌ కేసు నమోదు చేసినట్లు  ఓర్వకల్లు  ఎస్‌ఐ మల్లికార్జున మంగళవారం తెలిపారు.  పశ్చిమ బెంగాల్‌కు చెందిన  సదాలి మౌలా పెరోలి, బీబీ పుట్టగొడుగుల పరిశ్రమలో గత నెలన్నర క్రితం నుంచి పని చేస్తున్నారని అన్నారు.  ఈ నెల 16న ఉదయం 9 గంటల సమయంలో వారి కూతురు మునీరా (4) కనిపించలేదన్నారు. అయితే.. అగ్నిప్రమాదం మంటల్లో చిక్కుకుని మృతి చెంది ఉండవచ్చన్న అనుమానంతో ఫైర్‌ సిబ్బంది, పోలీసులు ఎంత గాలించినా ఆచూకీ లభించకపోవడంతో మిస్సింగ్‌ కేసును నమోదు చేశామని ఆయన తెలిపారు. బాలిక ఆచూకీ తెలిస్తే  9121101067, 9121101065 నెంబర్లను సంప్రదించాలని ఎస్‌ఐ తెలిపారు. Read more