మాజీ మంత్రి దంపతులపై కేసు నమోదు

ABN , First Publish Date - 2022-02-17T05:15:47+05:30 IST

మాజీ మంత్రి అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్‌నాయుడు దంపతులపై బీజేపీ నాయకుడు భూమా కిశోర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ పోలీసులు బుధవారం తెలిపారు.

మాజీ మంత్రి దంపతులపై కేసు నమోదు

ఆళ్లగడ్డ, ఫిబ్రవరి 16: మాజీ మంత్రి అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్‌నాయుడు దంపతులపై బీజేపీ నాయకుడు భూమా కిశోర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ పోలీసులు బుధవారం తెలిపారు. పట్టణంలోని కందుకూరు రోడ్డులో గల 574/2 సర్వే నెంబరులో నిర్మించిన ప్రహరీని పడగొట్టటం, అక్కడున్న వాచ్‌మెన్‌ను బెదిరించడంపై భూమా కిశోర్‌రెడ్డి ఫిర్యాదు చేశారని, ఈ మేరకు మాజీ మంత్రి దంపతులతోపాటు మరో 22 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. Read more