ఎదురుచూపులే...!

ABN , First Publish Date - 2022-12-10T00:02:57+05:30 IST

డొక్కల కరువు చవిచూసిన పల్లెలు అవి.

   ఎదురుచూపులే...!
చెరువులకు కృష్ణా జలాలు మళ్లించేందుకు ప్రధాన పైపులైన పనులు (ఫైల్‌)

డిసి్ట్రబ్యూటరీల నిర్మాణంలో జాప్యం

2021 డిసెంబరులో ట్రయల్‌ రన సక్సెస్‌

ఖరీఫ్‌కు అందని సాగునీరు

వచ్చే ఖరీఫ్‌ వరకు కరువు రైతులకు నిరీక్షణ తప్పదా?

68 చెరువుల కింద 10 వేల ఎకరాలకు సాగునీరు లక్ష్యం

హంద్రీనీవా కాలువ నుంచి కృష్ణా జలాల ఎత్తిపోతల స్కీం

రూ.224.31 కోట్లతో టీడీపీ ప్రభుత్వంలో శ్రీకారం

మూడున్నరేళ్లయినా పూర్తి కాని వైనం

68 చెరువుల కథ ఇది

(కర్నూలు-ఆంధ్రజ్యోతి):

డొక్కల కరువు చవిచూసిన పల్లెలు అవి. వానొస్తే పంట.. లేదంటే కన్నీటి మంటలే. తాతల కాలంలో నిర్మించిన చెరువులు ఉన్నా.. వర్షాభావంతో అవి నీటికి దూరమయ్యాయి. ఆ గ్రామాల మీదుగా వెళ్లే హంద్రీనీవా కాలువలో కృష్ణా జలాలు పరుగులు పెడుతున్నా దాహం తీర్చుకోలేని దుస్థితి. డోన, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాల్లో 10 వేల ఎకరాలకు సాగునీరు, వివిధ గ్రామాలకు తాగునీరు ఇవ్వాలనే ఆశయంతో 68 చెరువులకు హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణా జలాల ఎత్తిపోతల పథకానికి చంద్రబాబు ప్రభుత్వం రూపకల్పన చేసింది. రూ.224.31 కోట్లతో 2018 అక్టోబరులో పనులకు శ్రీకారం చుట్టారు. వైసీపీ ప్రభుత్వం వచ్చి మూడున్నరేళ్లు దాటినా పూర్తి చేయలేదు. జనవరిలోనే ట్రయల్‌ రన సక్సెస్‌ అయినా.. డిసి్ట్రబ్యూటరీల నిర్మాణంలో జాప్యంతో ఖరీఫ్‌లో ఒక్క చెరువుకు కూడా నీటిని ఎత్తిపోయలేదు. ఇంజనీర్లు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల ఒక సీజన నష్టపోవాల్సి వచ్చింది. వచ్చే ఖరీఫ్‌కైనా సాగునీరు ఇస్తారా..? అన్నది ప్రశ్నార్థకమే.

రాయలసీమ పల్లెలను వెంటాడుతున్న దుర్భిక్షాన్ని శాశ్వతంగా నివారించే లక్ష్యంతో హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం చేపట్టారు. శ్రీశైలం జలాశయం ఎగువన నందికొట్కూరు మండలం మాల్యాల నుంచి 40 టీఎంసీలు కృష్ణా వరద జలాలు ఎత్తిపోసి కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో 6.05 లక్షల ఎకరాలకు సాగునీరు, 35 లక్షల జనాభాకు తాగునీరు ఇవ్వాలి. కర్నూలు జిల్లాల్లో 8 టీఎంసీలు వినియోగించుకొని 80 వేల ఎకరాలఉ సాగునీరు, కొన్ని గ్రామాలకు తాగునీరు ఇవ్వాలి. డోన, పత్తికొండ, పాణ్యం, ఆలూరు నియోజకవర్గాల్లో సాగునీరు అందించే చెరువులు ఉన్నా... వర్షాలు లేక ఒట్టిపోతున్నాయి. కనీసం పశువులకు తాగునీరు కూడా అందని దుస్థితి ఉంది. ఈ నియోజకవర్గాల్లో 108 చెరువులకు హంద్రీనీవా జలాలు ఎత్తిపోసి కరువు పల్లెలను సస్యశామలం చేయాలని ఆనాటి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ప్రత్యేక చొరవ తీసుకొని అప్పటి సీఎం చంద్రబాబును ఒప్పించారు. ఫేజ్‌-1 కింద 86 చెరువులకు 1.24 టీఎంసీలు ఎత్తిపోసి... 10,130 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని 2018 అక్టోబరులో రూ.224.31 కోట్లతో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఫ టీడీపీ ప్రభుత్వంలో రూ.65 కోట్లు ఖర్చు

హంద్రీనీవా కాలువ 90 కి.మీ. వద్ద కృష్ణగిరి మండలం అలంకొండ సమీపంలో రోజుకు 150 క్యూసెక్కులు ఎత్తిపోసేలా మూడు పంపులు (ఒక్కో పంపు 50 క్యూసెక్కులు)తో ప్రధాన పంపింగ్‌ స్టేషన నిర్మించారు. అక్కడి నుంచి 5 కి.మీ. ప్రెజర్‌ మెయిన పైపులైన నిర్మించి.. కటారుకొండ దగ్గర నిర్మించిన డెలివరి పాయింట్‌కు నీటిని ఎత్తిపోయాలి. అక్కడి నుంచి మూడు వైపులా గ్రావిటీ మెయిన పైపులైన్లు 68 చెరువులు నింపాలి. ఈ పనులను హైదరాబాద్‌కు చెందిన కోయా కంపెనీ 4.95 శాతం అధిక రేట్లకు చేపట్టింది. పంపింగ్‌ స్టేషన, ప్రెజర్‌ మెయిన, గ్రావిటీ మెయిన పైపులైన్ల వంటి నిర్మాణాలు, భూ సేకరణ పనులు వేగం అందుకున్నాయి. టీడీపీ ప్రభుత్వంలో ఆరు నెలల్లో సుమారు రూ.65 కోట్లకు పైగా విలువైన పనులు చేశారు.

ఫ ఏడాదిలోగా అంటూ..

2019 మేలో వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి 2020 ఖరీఫ్‌కు 68 చెరువుల కింద ఆయకట్టుకు సాగు నీరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ పూర్తి కాలేదు. చెరువులకు నీటిని ఎత్తిపోయలేదు. వైసీపీ ప్రభుత్వం మూడున్నర ఏళ్లలో పైపులైన, పంపింగ్‌ స్టేషన, డెలివరీ పాయింట్‌ వంటి పనులకు రూ.115 కోట్లు ఖర్చు చేసింది. అంటే.. ఏడాదికి సరాసరి రూ.31 కోట్లు ఖర్చు చేశారు. టీడీపీ ప్రభుత్వంలో ఆరు నెలలకే రూ.65 కోట్లు ఖర్చు చేశారు. అదే వేగంతో పనులు చేసి ఉంటే ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన ఇచ్చిన హామీ మేరకు 2020 ఖరీఫ్‌కు సాగునీరు అందేది. నిధుల కొరత, ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ తీసుకోకపోవడం వెరసి కరువు రైతులకు శాపంగా మారింది. ఆ తరువాత గత ఏడాది దసరా అన్నారు.... ఈ ఏడాది సంక్రాంతి అన్నారు. కాదు.. దీపావళి అన్నారు. దసరా, సంక్రాంతి, దీపావళి పోయినా చెరువులకు కృష్ణా జలాలు మాత్రం చేరలేదు.

ఫ వచ్చే ఖరీఫ్‌కైనా చేరేనా?:

అలంకొండ పంపింగ్‌ స్టేషన, ప్రెజర్‌ మెయిన పైపులైన పూర్తయ్యింది. గ్రావిటీ మెయిన (జీఎం)-1లో 44.4 కి.మీ.లు, జీఎం-2లో 29.40 కి.మీ., జీఎం-3లో 47.9 కి.మీ. గ్రావిటీ మెయిన పైపులైన 80 శాతం పూర్తయింది. గత జనవరిలో ట్రయల్‌ రన చేపడితే సక్సెస్‌ అయ్యింది. అప్పటి వరకు మైనర్‌ ఇగిరేషన కర్నూలు డివిజన ఇంజనీర్ల పర్యవేక్షణలో పనులు చేపట్టారు. ఆ సమయానికి రూ.164.51 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మైనర్‌ ఇగిరేషన డివిజన నుంచి ఇరిగేషన ఎప్‌ఆర్‌ఎల్‌ డివిజనకు 68 చెరువులకు హంద్రీనీవా నీటి ఎత్తిపోతల పథకం పనులు అప్పగించారు. ఈ 10 నెలల్లో ఎఫ్‌ఆర్‌ఎల్‌ డివిజన పర్యవేక్షణలో కేవలం రూ.17 కోట్ల విలువైన పనులే జరిగాయి.

ఫ డివిజన మారినా కనిపించని పురోగతి

గ్రావిటీ మెయిన పైపులైన నుంచి చెరువులకు నీటిని మళ్లించే డిసి్ట్రబ్యూటరీ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. పొలాల్లో పంటలు ఉండడంతో నిర్మాణం చేయలేని పరిస్థితి ఉందని ఇంజనీర్లు అంటున్నారు. టీడీపీ ప్రభుత్వంలో భూ సేకరణలో జాప్యం జరిగితే రైతులను ఒప్పించి పనులు మొదలు పెట్టారు. అదే విధంగా రైతులను ఒప్పించి డిసి్ట్రబ్యూటరీలు నిర్మించి ఉంటే ఈ ఏడాదే చెరువులకు నీరు మళ్లించే అవకాశం ఉండేది. మంత్రులు బుగ్గన, గుమ్మనూరు సహా పత్తికొండ, పాణ్యం ఎమ్మెల్యేలు శ్రీదేవి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆ దిశగా చొరవ తీసుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎంఐ డివిజన ఇంజనీర్ల పర్యవేక్షణలో పురోగతి లేదని ఎఫ్‌ఆర్‌ఎల్‌ డివిజనకు బదలాయించినా పురోగతి నత్తనడకనే సాగుతోందనే ఆరోపణలు లేకపోలేదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి వచ్చే ఖరీఫ్‌లోనైనా చెరువులకు కృష్ణా జలాలు ఎత్తిపోస్తారని రైతులు ఆశిస్తున్నారు.

ఫ నియోజకవర్గాల వారీగా చెరువులు.. ఆయకట్టు వివరాలు:

----------------------------------------------------------

నియోజకవర్గం చెరువులు ఆయకట్టు

-----------------------------------------------------------

డోన 28 4,031

పత్తికొండ 35 5,749

ఆలూరు 3 197

పాణ్యం 2 153

--------------------------------------------------------------

మొత్తం 68 10,130

-----------------------------------------------------------

ఫ ఈ నెలాఖరులో 35 చెరువులకు నీరు

- నారాయణరెడ్డి, ఈఈ, ఇరిగేషన ఎఫ్‌ఆర్‌ఎల్‌ డివిజన, కర్నూలు:

హంద్రీనీవా కాలువ నుంచి 68 చెరువులకు ఎత్తిపోతల పథకం పనులు 80 శాతం పూర్తయ్యాయి. ఇప్పటి వరకు రూ.180 కోట్లు ఖర్చు చేశాం. పొలాల్లో పంటలు ఉండడం వల్ల డిసి్ట్రబ్యూటరీల నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. ఈ నెలాఖరులోగా 35 చెరువులకు నీటిని ఎత్తిపోయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వచ్చే ఖరీఫ్‌కు 68 చెరువులకు కృష్ణా జలాలు ఎత్తిపోస్తాం.

Updated Date - 2022-12-10T00:02:59+05:30 IST