ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2022-08-18T05:07:20+05:30 IST

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాలు 2022కు ప్రభుత్వ ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నంద్యాల డీఈవో వసుంధర దేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

నంద్యాల (నూనెపల్లె), ఆగస్టు 17: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాలు 2022కు ప్రభుత్వ ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నంద్యాల డీఈవో వసుంధర దేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాల విద్యా కమిషనర్‌ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సంబంధిత డిప్యూటీ ఈవో, మండల విద్యాశాఖాధికారికి ఈనెల 24వ తేదీలోపు దరఖాస్తులను అందించాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు తమ ప్రతిపాదనలను ఓరిజినల్‌తో పాటు రెండు నకలు ప్రతులను డీఈవో కార్యాలయంలో అందజేయాలని సూచించారు. దరఖాస్తుల ఆప్లికేషన ఫారాలు ఆయా మండలాల ఎంఈవో కార్యాలయాల్లో, డిప్యూటీ ఈవో కార్యాలయాల్లో తీసుకోవాలని చెప్పారు. ఈనెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ, 26వ తేదీన పరిశీలన, 28న తుది జాబితా సమర్పణ, 5వ తేదీన పురస్కారాల ప్రదానోత్సవం ఉంటుందని తెలిపారు. 


 

Read more